సినిమా To పాలిటిక్స్.. నగరిలో వికసించిన రోజా.?
- సినీ గ్లామరే రాజకీయాల్లో కలిసి వచ్చిందా.?
- నగరిలో నమ్మిన బంటుగా ఎదిగిన రోజా.!
రోజా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని వెంకటేష్, బాలకృష్ణ,చిరంజీవి, తరం హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఒకప్పుడు ఈ హీరోలతో సమానంగా నటనలో పోటీ పడింది. అలాంటి రోజా హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో ఓ మెరుపు మెరిసింది. టాలీవుడ్ అనే తోటలో విరబూసిన ఈ రోజా అంచలంచలుగా ఎదుగుతూ రాజకీయాలు అనే అడవిలోకి వెళ్లి తనకంటూ ప్రత్యేకమైన బౌండరీ గీసుకొని ప్రజల మనసును చురగొన్నది. అలాంటి రోజా రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, సినీ గ్లామర్ ఆమెకు ఏ విధంగా పనికివచ్చింది అనే వివరాలు చూద్దాం.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి:
చక్కటి నవ్వు అద్భుతమైన ఆహార్యం ఆమె సొంతం. తిరుపతి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టినరోజా 15 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందలకు పైగా చిత్రాల్లో చేసింది. 1972లో పుట్టినరోజు రోజా అసలు పేరు శ్రీలత. రోజా తండ్రి పేరు నాగరాజా రెడ్డి తండ్రి లలిత. ఈయన సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. అంతే కాదు ఆయన కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా తీశారు. తల్లి నర్స్ గా చేసేది. డిగ్రీలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన రోజా , ఎక్కువగా సినిమాలపై మక్కువ ఉండటంతో అలా 18 సంవత్సరాల వయసులో ప్రేమ తపస్సు సినిమా కోసం రోజాను అడిగారట. అలా ఈ సినిమాలో నటన తెలియకుండానే నటించిందట ఇందులో రాజేంద్రప్రసాద్ కు హీరోయిన్ గా చేసింది. కానీ ఈ చిత్రం అనూహ్యంగా భారీ హిట్ అయింది. అప్పుడు మొదలైన సినీ ప్రయాణం భైరవద్వీపం వంటి అద్భుతమైన చిత్రాల్లో హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగింది. ఇలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత 1991లో సెల్వమణితో పరిచయం ఏర్పడి 2002లో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.