అప్పట్లో పెను దుమారే రేపిన సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ రంగప్రవేశం..!!

murali krishna

* రాజీవ్ గాంధీ పిలుపుతో రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చిన సూపర్ స్టార్

* ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ఎదుర్కున్న ఏకైక నాయకుడుగా గుర్తింపు..

అప్పట్లో సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు విడదీయలేని అనుబంధం వుండేది..అప్పటి ఎంజిఆర్, ఎన్టీఆర్ నుంచి ఇప్పటి చిరంజీవి,పవన్ కళ్యాణ్ వరకు సినీ ఇండస్ట్రీ లో ఎందరో నటినటులు రాజకీయాలలో ఘననీయంగా రాణించారు...తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ అప్పట్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు.. పార్టీ స్థాపించిన 9 నెలలులోనే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇదే సమయంలో అటు సినిమాలలోను అలాగే రాజకీయాలలోనూ ఎన్టీఆర్ ఢీ కొట్టిన నటుడు ఘట్టమనేని కృష్ణ..ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టిన నాదెండ్ల భాస్కరరావుకి అనుకూలంగా ఒక పెద్ద పేజీలో ప్రకటన విడుదల చేసి కృష్ణ సంచలనం సృష్టించారు..దానితో అప్పటి రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి..

ఘట్టమనేని శివరామకృష్ణ అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు వుండరు..చాలా మందికి ఆయన సరికొత్త పంథాతో సినిమాలు తెరకెక్కించే గొప్ప నటుడుగానే తెలుసు.. అయితే ఆయనలో తెలియని మరోకోణం సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం..అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంత్యక్రియలకు సూపర్ స్టార్ హాజరయ్యారు..ఇదే సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన సంఘటన..ఈ సంఘటన అప్పట్లో సంచలనం అని చెప్పాలి.. ఇందిరా గాంధీ అంత్యక్రియల నుంచే రాజీవ్ గాంధీతో కృష్ణకు పరిచయం ఏర్పడింది.ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అద్వానంగా మారింది..ఎన్టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ కోటలకు బీటలు వారాయి.. దానితో ఎన్టీఆర్ కు దీటైనా నాయకుడికోసం కాంగ్రెస్ వెతుకుతుంది.

 ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టిన నాదెండ్ల భాస్కరరావుకి అనుకూలంగా ఒక పెద్ద పేజీలో ప్రకటన విడుదల చేసి కృష్ణ సంచలనం సృష్టించారు.అలా కాంగ్రెస్ కి కనిపించిన ఏకైక నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ..ఎన్టీఆర్ తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ.. రాజీవ్ గాంధీతో వున్న సన్నిహిత్యంతో కృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.. రాజీవ్ మాట కాదనలేకపోయిన కృష్ణ.1984 లో కాంగ్రెస్ లో చేరారు..సూపర్ స్టార్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి..

క్రియాశీలక రాజకీయాలలో సూపర్ స్టార్ క్రేజ్ చూసి 1989 లో ఆయనకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది..ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారు..అప్పట్లో ఈ విజయం ఒక సంచలనం.. ఈ విజయంతో రాజీవ్ గాంధీకి కృష్ణ మరింత దగ్గరయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ను ఎదుర్కొగల నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ అని కాంగ్రెస్ అధిస్థానం నిర్ణయానికి వచ్చింది..కానీ రాజీవ్ హత్య తో ఒక్కసారిగా అంతా మారిపోయింది.. రాజీవ్ హత్యకు గురికావడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కృష్ణ ఓడిపోయారు.. ఇక అప్పటి నుంచి కృష్ణ రాజకీయాలకు దూరంగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: