సినీ గ్లామర్ తో రాజకీయాల్లో రాణించిన పవన్..?

Pulgam Srinivas
సినిమాల్లో అద్భుతమైన స్థాయికి ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అనేక మంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సినిమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన స్థాయికి ఎదిగిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటారు.

ఈయన సినిమాల్లో స్టార్ హీరో స్థాయికి ఎదిగి ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగించి ఆ తర్వాత తెలుగు దేశం అనే ఓ పార్టీని స్థాపించి , పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలో నే ముఖ్య మంత్రి కూడా అయ్యారు. ఇకపోతే ఆ తర్వాత ఈయనను ఫాలో అయ్యి చాలా మంది తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల వైపు ఆసక్తి చూపించాడు. మొదట తన అన్న అయినటువంటి చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చురుగ్గా పాల్గొన్నాడు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ ఆ తర్వాత 2014 వ సంవత్సరం జనసేన అనే పార్టీని స్థాపించాడు.

ఇక ఈ పార్టీ 2019 వ సంవత్సరం అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొంది. కాకపోతే ఈ ఎన్నికలలో ఈ పార్టీ కి ఘోర ఓటమి దక్కింది. ఇక 2024 వ సంవత్సరం ఈ పార్టీ తెలుగుదేశం , బి జె పి లతో పాటు పొత్తులో పోటీ చేయగా ఈ పార్టీ పోటీ చేసిన స్థానాలన్నింటిలో గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి తో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులలో కూడా ఉన్నాడు. ఇలా సినిమాలలో సక్సెస్ అయ్యి రాజకీయాల్లోకి కూడా వచ్చే సక్సెస్ అయిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరిగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: