ఉచిత సంక్షేమ పధకాలే అభివృద్ధికి అసలైన ఆటంకాలు..!!

murali krishna

* ఆంధ్రప్రదేశ్ లో ఉచిత పధకాలే ప్రస్తుతం హాట్ ఫేవరెట్..!!
* ఉద్యోగాలు లేక యువత వలస పోతున్న పధకాలే కావాలి..
* రాజధాని లేక రాష్ట్రం రావణ కాష్టంలా మారుతున్నా పధకాలే కావాలి

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందు వున్న పెద్ద టార్గెట్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం.. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది.. ప్రతి పక్షంలో వున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు సాధ్యాసాధ్యాలు చూడకుండా ఉచిత హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా వున్నప్పడు కూడా సంక్షేమ పధకాలు ఉండేవి.. మరీ ఇంతలా మాత్రం ఎప్పుడు లేదు.. గత ఐదేళ్లు పాలించిన జగన్ ప్రజలకు ఉచిత పధకాలు విపరీతంగా అలవాటు చేసారు. వాలంటీర్, సచివాలయం వంటి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రజల ఇంటి వద్దకే పధకాలను అమలు చేసారు.. దీనితో ప్రజలకు అది బాగా అలవాటు అయిపోయింది..
గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆలోచించలేదు.. ఎంత సేపు మీటింగ్ పెట్టడం బటన్ లు నొక్కడం వంటివి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏమిలేదు. అయితే ఇస్తున్న ఆ సంక్షేమ పధకాలను అయిన సక్రమంగా అమలు చేసారా అంటే అదీ లేదు..ప్రతి పధకానికి సంవత్సరానికి ఒకసారి రూల్స్ ఎక్స్టెండ్ చేయడం లబ్దిదారుల సంఖ్య తగ్గించడం వంటివి చేసారు.. దీనితో ప్రజలు విసిగిపోయారు.. అయితే జగన్ పధకాలకు రెట్టింపు పధకాలు ఇస్తామన్న కూటమిని ప్రజలు గెలిపించారు.. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అప్పు కోసం ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అప్పు చేసి మరీ ఉచిత పధకాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

 గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో క్లారిటీ లేకుండా పోయింది. ప్రభుత్వం మారితే రాజధాని మారుతుంది.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధానిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ధ్రువీకరించింది. అయితే ఉచిత హామీలు ఉన్నంత కాలం రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగదు..దీనికి ఎవరో ఒకరు అడ్డుకట్ట వేయాలి.. లేకపోతే ముందు ముందు రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: