ఏపీ: పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దగ్గం..!

Divya
గత కొంతకాలంగా కొన్ని ప్రాంతాలలో ఫైల్స్ దహనం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా గడిచిన కొద్దిరోజుల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురిచేసింది. ఈ ఘటన పైన ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఉండే అధికారుల పైన కూడా సస్పెన్స్ వేటు కొనసాగించింది. ఇది కాస్త కనుమరుగవుతున్న సమయంలో ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఫైల్ లో ఫైల్స్ కూడా దగమైనట్లుగా వినిపిస్తున్నాయి.దీంతో ఒక్కసారిగా ఈ విషయం ఏపీలో కలకలాన్ని సృష్టిస్తోంది.

అటు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైల్స్ దహనం విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు దగ్ధం అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఫైల్స్ దగ్ధమవడంతో ఇందుకు గల కారణం ఎవరు ఏంటని విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది. భూ సేకరణకు సంబంధించిన లబ్ధిదారులకు పరిహారం విషయంలో కూడా చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవి బయటపడకుండా ఉండేందుకు సైతం ఈ ఘటనకు ఎవరో పాల్పడినట్లుగా అనుమానాలను తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఈ ఘటన పైన డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో పని చేస్తున్న వారందరి పైన కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎన్ని ఫైల్స్ దగ్గమయ్యాయి అలా దగ్ధమైన వాటిలో ఉంటున్నటువంటి సమాచారం ఏంటి అని విచారణ కూడా చేపడుతున్నారట. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన లబ్ధిదారుల పరిహారాలకు సంబంధించి ఏ ఏ సమాచారం ఉన్నదని విషయాన్ని కూడా డిప్యూటీ కలెక్టర్ ఆరా తీస్తున్నారట. మరి ఏ మేరకు ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: