అన్న క్యాంటీన్ల విషయంలో ప్రజల రెస్పాన్స్ ఇదే.. ఆ రేంజ్ లో విరాళాలు ఇస్తున్నారా?
చాలా ప్రాంతాలలో ప్రజలు లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు అన్న క్యాంటీన్లకు విరాళం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు అన్న క్యాంటీన్లకు ఊహించని స్థాయిలో విరాళాలు ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వడం ద్వారా పేద ప్రజలు పట్టెడన్నం తింటే చాలని చాలామంది భావిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అన్న క్యాంటీన్లను రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ప్రస్తుత కాలంలో హోటళ్లలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయాలంటే 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో 5 రూపాయలకే ఫుడ్ తినే అవకాశం లభించడం విషయంలో పేద ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్నచిన్న వ్యాపారులు, ఆర్థిక సమస్యలు ఉన్న నిరుపేదలు అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చు అవుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ పథకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్న నేపథ్యంలో ఖర్చు విషయంలో వెనుకాడటం లేదు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మరిన్ని పథకాల అమలు జరగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయనుందని తెలుస్తోంది.