తిరుపతి: టీటీడీ భవనంలో అగ్ని ప్రమాదం.. ఆ కీలక ఫైల్స్ దగ్ధం..!

Divya
ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లో కూడా చాలా మంది అవినీతి చేయడానికి పాల్పడుతున్నారు.. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి చాలామంది పలు రకాల ఫైల్స్ ని కూడా దగ్ధం చేయిస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం మదనపల్లి ఘటన నిన్నటి రోజున పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడంతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. అయితే ఇప్పుడు తాజాగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఉండేటువంటి భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదంలో టీటీడీ పరిధిలో స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దస్త్రాలు కూడా పూర్తిగా కాలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటన పైన అధికారులకు నాగార్జున అనే ఉద్యోగి సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని తీసుకువచ్చి ఆ మంటలను సైతం ఆర్పేశారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ భాస్కర్ కూడా ఫిర్యాదు చేయడంతో అలిపిరి పోలీసులు ఈ ఫైర్ ఆక్సిడెంట్ పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా కుట్రపూరితంగా చేశారో అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన టిటిడి పరిపాలన భవనాన్ని సైతం అక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ సివి అండ్ ఎస్ఓ శ్రీధర్ సైతం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆలయాలకు వేసినటువంటి రోడ్లకు సంబంధించిన ఫైల్స్ సైతం దగ్ధమైనట్లుగా అధికారులు గుర్తించారట.అయితే ఈ ఫైల్స్ ఉండడంవల్ల డేటా మొత్తం కాస్త సేఫ్ గా ఉంటుందని భావించినప్పటికీ ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని విషయం పైన ఇంకా అధికారులు సైతం విచారిస్తూ ఉన్నారు. ఎంతో పగడ్బందీగా ఉండే టీటీడీ పరిపాలక భవనంలో ఇలాంటివి జరిగితే ఎలా అంటూ ప్రజల సైతం ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఫైల్స్ దగ్ధం వెనుక ఎవరు హస్తం ఉందా లేదా అనే విషయం కనిపెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: