జగన్ ఒంటెద్దు పోకడ.. ఇది అర్థం కాకపోతే పార్టీ పతనమే.!

Pandrala Sravanthi
గాల్లో మేడలు కట్టి కూలిపోవద్దంటే  అది ఎప్పటికీ సాధ్యం కాదు.  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది ఈ మీడియా ఛానల్స్ నన్ను ఏం చేస్తాయని ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్లారు. చివరికి ప్రజల్లో ఆయన చేసిన అభివృద్ధి పక్కకు పోయి నెగిటివ్  వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయి. దీంతో 175కు 175 గెలుస్తానన్న జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయాడు. కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయినా జగన్ కు ఇప్పటికీ ఏమీ అర్థం కావడం లేదని తెలుస్తోంది. కేవలం సాక్షి మీడియా పేపర్ తప్పర్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే చానల్స్ ఏమీ లేవు. అలాంటి ఈ తరుణంలో జగన్ రెడ్డి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో జరిగే తప్పులను ఎత్తిచూపుతూ ప్రశ్నించాలి.  కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అలా చేయకుండా టైం దొరికినప్పుడు అలా బెంగళూరు వెళుతూ గడుపుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన, తాజాగా సోమవారమే బెంగళూరు నుంచి తిరిగి వచ్చి విశాఖ ఉమ్మడి జిల్లాలో  నియోజకవర్గంలో పర్యటించి  ఆగస్టు 15న తన క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఆ తర్వాత వెంటనే బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ఈ రెండు నెలల్లో జగన్ బెంగళూరు వెళ్లడం  ఆరోసారి. దీంతో జగన్ కు వ్యతిరేకంగా  పని చేస్తున్న మీడియా సంస్థలు మొత్తం ఆయన కదలికల పైన దృష్టి పెట్టి ప్రతిక్షణం   నెగిటివ్ వార్తలే రాస్తున్నాయి.  


దీనికి ప్రధాన కారణం జగన్  ఆ మీడియా ఛానల్స్ తో మింగిల్ అవ్వకపోవడం. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం. నేను ఎంతో అభివృద్ధి చేశాను నాకే ఓట్లు పడతాయని అపోహకు వెళ్లిపోవడం. ఈ విధంగా తనకు తాను హీరో అని ఫీల్ అవుతూ ఉండడం వల్లే ఆయన ఓటమి వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు  చాలాసార్లు హైదరాబాదులోనే గడిపారు. అప్పుడు ఏ ఒక్క ఛానల్ లో కూడా పేపర్ లో కూడా వార్తలు రాలేదు. చివరికి సాక్షి మీడియాలో కూడా ఈ వార్తలను ప్రస్తావించలేదు. అంటే ఈ ఛానల్స్ చంద్రబాబు ఎలా మింగిల్ అవుతున్నారో జగన్ కూడా ఆ విధంగానే మింగిల్ అయితే ఆయన భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: