జగన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి.. జాలితో వదిలేశారట..?
వైసీపీ నేత జగన్ కు ఒక్క డిపార్ట్మెంట్ పై కూడా అవగాహన లేదని కామెంట్లు చేశారు. తనకు వైసీపీ నేతలందరూ టచ్ లో ఉన్నారని, ఒక్కసారి గేట్ ఎత్తితే అందరూ టీడీపీలో జాయిన్ అయిపోతారని, జగన్ ఏకాకి అవుతారని ఈయన అన్నారు. జాలి పడే జగన్ని వదిలేశాం అని కూడా ఆయన భారీ డైలాగులు చెప్పారు. చంద్రబాబు ఎవరినీ చేర్చుకోనని ముందే చెప్పారని అందుకే వైసీపీలో ఆమాత్రం నేతలు ఉన్నారని ఈయన అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ వచ్చే ఛాన్స్ లేదని ఈయన జ్యోతిషం చెప్పారు. మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పద్ధతి మారం రేపుతున్నాయి ఆయన వైసిపికి ఇచ్చిన వార్నింగ్ కూడా తీవ్ర చర్చినీయాంశమయ్యింది.
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి వాసంశెట్టి సుభాష్ జగన్ చుక్కలు చూపిస్తారు అని వైసీపీ సానుభూతిపరులు కామెంట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లి కూడా పులి అవుతుందని వైసీపీ మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మంత్రి వాసంశెట్టి రీసెంట్గా విజయవాడలోని గుణదల ఈఎస్ఐ కొత్త ఆసుపత్రిని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కూడా జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో వైఎస్సార్ బీమా పేరుతో వైసీపీ లీడర్స్ కోట్లు కాల్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 5 ఏళ్ల పాలనలో ఈఎస్ఐ హాస్పటల్ని చాలా బాడ్ గా ట్రీట్ చేసి దానిని చేసి అవినీతి మయం చేసారని అలిగేషన్స్ చేశారు.