ఏపీ: సచివాలయ వ్యవస్థ.. ప్రజా సమస్యలు తీర్చే వేదిక..!

Divya
•సచివాలయ వ్యవస్థ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం..
•ప్రజల సమస్యలు తీర్చడం మరింత సులభ..
•సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి చెరగని ముద్ర వేసుకున్నారు మాజీ సీఎం జగన్..
సాధారణంగా గ్రామాలలో ఏదైనా విషయం లో ప్రజలకు సమస్యలు వచ్చాయి అంటే చాలు అవి తీర్చడానికి సంవత్సరాల తరబడి సమయం పట్టేది. ముఖ్యంగా భూమిని మొదలుకొని ఆధార్ కార్డు వరకు ఇలా ఏ విషయంలో అయినా సరే పనులు జరగాలి అంటే పట్టణాలకు వెళ్లి గంటలు లేదా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను తీర్చే వేదికగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంత మంచి చేకూర్చింది అంటే వారు కావలసిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాలలో సొంత ఊరిలోనే నెరవేర్చుకునేలా ఒక వ్యవస్థను రూపుదిద్దారు. భూమికి సంబంధించిన పలు పనులను వదులుకొని పంటకు సంబంధించిన పనులు మందులు ఎరువులు ఇవే కాదు ఆధార్ కార్డు , రేషన్ కార్డు ఇలా ఏవైనా సరే మన ఊర్లోనే మనం సులభంగా పొందేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు.
ఈ సచివాలయ వ్యవస్థ అనేది ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ప్రతి 2000 కుటుంబాలకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవస్థల ద్వారా ఎన్నో మంచి పనులు చేపట్టింది. ప్రజలకు సమస్యలను తీర్చింది.. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ కారణంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా సులభంగా ప్రజల సమస్యలను తీర్చడానికి వీలు కుదిరింది. అంతేకాదు ఈ సచివాలయాల వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా పొందారు. ఇప్పుడు వారిని పెర్మనెంట్ చేసి ప్రతి నెల రూ.25 వేలకు పైగా జీతం అందిస్తూ.. వారికంటూ ఆర్థిక భరోసా అందించారు.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థ ఎంతో మందికి ఆదర్శం ప్రజలకు సేవ చేయాలనుకునే ప్రతి నాయకుడికి ఇలాంటి వ్యవస్థ మరింత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు ఊరువాడ ప్రతి ఒక్కరికి లభించాలంటే కష్టం..కానీ ఇలాంటి వ్యవస్థలు ఉండడం వల్ల ఈ పథకాలు అందజేయడం మరింత సులభం అవుతుంది . ఓటర్లను ఆకర్షించడం ఇంకా సులబమవుతుంది . మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థ చెరగని ముద్ర అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: