తాడిపత్రి రణరంగం...కేతిరెడ్డిపై హత్యకు యత్నం ?
తాడిపత్రిలో నేనుంటే రాజకీయంగా అడ్డొస్తాననే ఈ దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి రాజకీయాలకు మేము అడ్డొస్తామని గతంలో మా అన్నను హత్య చేశారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కందిగోపుల మురళి ఇంటిపై దాడి చాలా బాధాకరమన్నారు. గతంలో కూడా మురళి ఇంటిపై జెసి కుటుంబం దాడి చేసిందని తెలిపారు.
నన్ను తాడిపత్రి రాకుండా చేసేందుకు ఇలాంటి చిన్న చిన్న గొడవలు చేసి నన్ను తాడిపత్రి రాకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి వైసిపి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నా ఊపిరి ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటానని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే కందిగోపుల మురళి లైసెన్సు తుపాకీలు బయటకు తీశాడన్నారు.
మరలా ఎస్పీ అనుమతితో తాడిపత్రికి వెళతానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జెసి అస్మిత్ రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు నన్ను అంతమొందించేందుకు వెనుకాడరనే హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశానన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాజకీయంగా నన్ను అడ్డు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన షాకింగ్ కామెంట్స్ తో అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు రణరంగంగా మారిపోతున్నాయి. మరి దీని పై టీడీపీ పార్టీ నేత ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.