జగన్‌ కు షాక్‌...కాంగ్రెస్‌ లోకి వైసీపీ నేతలు ?

Veldandi Saikiran

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే ప్రతి పక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ రూపంలో పెను ప్రమాదం ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికు వచ్చింది. వైసీపీ నేతలు కొంత మంది కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారట. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు చేసిన కామెంట్స్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు ప్రెస్ మీట్  మాట్లాడారు.

ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు.  బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  వైసిపి నేతలు కాంగ్రెస్ పార్టీ సోదరులేనని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ప్రకటించారు.  ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
మోడీ 11 ఏళ్ల కాలంలో పనికిదేశంలో పర్యటించారన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఉన్నారని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు. దేశానికి ఏ రకమైన ఉపయోగం చేకూరింది ప్రజలకు తెలియజేయాలని కోరారు. దేశంలో మైనింగ్ కార్యకలాపాలను అతని అంబానీలకు కట్టబెట్టారని తెలిపారు.

ఇటీవల కాలంలో అదానీ సంస్థపై పలు ఆరోపణలు వస్తున్నాయని... అధిక అక్రమాలపై పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. డాలర్ రేట్ ను ప్రపంచ స్థాయిలో తగ్గిస్తానని చెప్పిన మోడీ ఈరోజు డాలర్ రేట్ ఎంత ఉందో తెలియజేయండన్నారు. సోలోగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రధాని విదేశీ పర్యటన వలన లాభాలు జరిగాయో తెలియజేయాలని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: