విజయవాడ వైసీపీలో జగన్ ఆ నేతను బలి పశువును చేస్తున్నాడా..?
- ( విజయవాడ - ఇండియా హెరాల్డ్ ) .
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను పరస్పరం కుండ మార్పిళ్ళు చేసి మరి పోటీ చేయించారు. అయితే ఇలా సీట్లు మార్చిన నేతలు అందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ క్రమంలోనే కీలకమైన విజయవాడ నగరం లో కూడా జగన్ మార్పులు చేర్పులు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాని కి మార్చి పోటీ చేయించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మైనార్టీ నేత మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ ను రంగంలోకి దించారు.
విచిత్రం ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బిజెపి నుంచి పోటీ చేసి ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తిరిగి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తారని తెలుస్తోంది సెంటర్ నియోజకవర్గ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లేదా మరో నేతకు అప్పగిస్తారని అంటున్నారు .. అక్కడి వరకు బాగానే ఉంది.
పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీగా ఖర్చుపెట్టి ఓడిపోయారు మైనార్టీ నేత షేక్ ఆసిఫ్. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావును తిరిగి పశ్చిమ నియోజకవర్గం కు పంపిస్తే షేక్ ఆసిఫ్ ను పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎన్నో అసలుతో ఎమ్మెల్యే అవ్వాలని కోట్లు ఖర్చుపెట్టుకుని పోటీ చేసిన ఆసిఫ్ ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు సీటు లేకుండా చేస్తున్నారు జగన్. జగన్ ఆడిన పొలిటికల్ గేమ్ లో ఆసిఫ్ బలి పశువు అయిపోయారని చెప్పాలి.