మోడీ ప్రభుత్వంలో నారా లోకేష్ కు కీలక పదవి ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే..ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతను చేసుకున్నారు.అటు ఈ విజయానికి సహాయపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు... డిప్యూటీ ముఖ్యమంత్రి అప్పగించారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో తన కుమారుడు నారా లోకేష్ కు కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు.

ఏపీలో ఐటి అలాగే విద్యా  శాఖ.. మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారు. అయితే ఈ రెండు శాఖల్లో..  దూకుడుగా పనిచేస్తున్న నారా లోకేష్ కు బంపర్ ఆఫర్ తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే మోడీ ప్రభుత్వం లో నారా లోకేష్ కు కీలక పదవి రాబోతుందని చర్చ జరుగుతుంది. బుధవారం రోజున ఢిల్లీ నుంచి నారా లోకేష్ కు ఫోన్ వచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి.. మంత్రి నారా లోకేష్ కు ఫోన్ రావడం జరిగింది.

దీంతో హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించాడు నారా లోకేష్. ఇక ఇవాళ... ఎన్డీఏ కూటమి సభ్యులతో... మంత్రి నారా లోకేష్ సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సందర్భంగా... నారా లోకేష్ కు కీలక పదవి ఇచ్చేందుకు మోడీ... నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా చెబుతున్నారు. అందుకే ప్రత్యేకంగా నారా లోకేష్ ను ఏపీ నుంచి పిలిపించుకున్నారని కూడా చర్చ జరుగుతోంది.
 

అయితే దీనిపై ఇవాళ చర్చ నిర్వహించి... కొన్ని రోజుల తర్వాత ఆ పదవిని నారా లోకేష్ కి ఇవ్వబోతున్నారట. మొట్టమొదటగా నారా లోకేష్ ను రమ్మని.. ఆయన అభిప్రాయాలను తెలుసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అయితే కేంద్రంలో మోడీ మరోసారి అధికారంలోకి రావడానికి... చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ క్షణమైనా చంద్రబాబు.. పక్కన జరిగితే ప్రభుత్వం కూల్పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు పార్టీ నేతలకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను దగ్గర చేసుకుంటుందని  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: