చంద్రబాబు కెరీర్ తలకిందులు చేసిన బషీర్‌బాగ్ కాల్పులు, అలిపిరి ఘటన?
* 2000 సంవత్సరంలో బషీర్ భాగ్ కాల్పులు
* ఈ కాల్పులకు నిరసనగా టిడిపికి కెసిఆర్ రాజీనామా
* ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు అని చంద్రబాబు పై ఆరోపణలు
* అలిపిరి కారు ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు... తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి... చక్రం తిప్పడం జరిగింది. ఆ తర్వాత... తెలుగుదేశం పార్టీని హ్యాండోవర్ చేసుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
అదే సమయంలో చంద్రబాబుపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని... కొంతమంది ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు కెరీర్లో అలిపిరి సంఘటన ఎవరు మర్చిపోనిది. 2003 సమయంలో నక్సలేట్లను వేరువేసేందుకు చంద్రబాబు... చర్యలు తీసుకున్నారు. ఈ తరుణంలోనే అదే సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన చంద్రబాబు కారుపై... నక్సలైట్లు బాంబు పేల్చినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సంఘటన అలిపిరిలో చోటుచేసుకుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కోసం చంద్రబాబు నాయుడు అలిపిరికి వెళ్లినప్పుడు... ఆయన కారు బ్లాస్ట్ అయింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ కారు.... చంద్రబాబు వాడటంతో... పెద్దగా ప్రమాదం అయితే జరగలేదు. ఈ ప్రమాదంలో చంద్రబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనతో పాటు ఉన్నవారికి కూడా గాయాలు కావడం జరిగింది.
సరిగ్గా 24 సంవత్సరాల కిందట అంటే 2000 ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్ చౌరస్తాలో పోలీసులు కాల్పులు జరిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... విపరీతంగా కరెంటు చార్జీలు పెంచడం జరిగింది.అయితే కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా... వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో బషీర్బాగ్ లో ఆందోళన చేశారు.ఆ సమయంలో... ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఆ సమయంలో ముగ్గురు మరణించారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కెసిఆర్ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు.