రోజా ఐరన్ లెగ్ అని ప్రూవ్ చేసిన సంఘటనలివే.. అలా తప్పు చేసి విమర్శల పాలయ్యారుగా!

Reddy P Rajasekhar
సినీ, రాజకీయ రంగాలలో రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ గా సక్సెస్ సాధించిన రోజా ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమయ్యారు. అయితే రోజాపై ఐరన్ లెగ్ ముద్ర పడటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సినిమాలకు రోజా గుడ్ బై చెప్పే సమయంలో రిటైర్మెంట్ కు ముందు ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొన్నారు.
 
రోజా టీడీపీలో చేరిన సమయంలోనే అలిపిరి ఘటన జరగడంతో పాటు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం సంచలనం అయింది. ఆ తర్వాత రోజా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో రోజా చురుగ్గా పోటీ చేసినా ఓటమిపాలు కావడం జరిగింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
అయితే రోజా కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు రోజులకే వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడం సోషల్ మీడియాలో సంచలనం అయింది. ఆ తర్వాత రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా జగన్ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. రోజాకు మంత్రి పదవి వచ్చే వరకు ఈ విమర్శలు తప్పలేదు. రోజా తన ఐరన్ లెగ్ ఇమేజ్ నుంచి త్వరగా బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 
రోజా పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. ఆమె రాబోయే రోజుల్లో సినిమాలపై దృష్టి పెడతారో లేక రాజకీయాలపైనే ఫోకస్ పెడతారో తెలియాల్సి ఉంది. రోజా తన లక్ష్యాలను సాధించి కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ కావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోజా రాబోయే రోజుల్లో పొలిటికల్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రోజాను అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు. రోజాపై ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: