భర్త నుంచి రూ.6 లక్షలు ఇప్పించాలంటూ భార్య కోర్టులో కేస్.. జడ్జి తీర్పు విని?
ఆ మహిళను ఉద్దేశించి, "ఒకే ఒక్క వ్యక్తికి నెలకు ఇంత డబ్బు అవసరం అవుతుందా? మీరు ఇంత డబ్బు ఖర్చు చేయాలంటే, మీరే సంపాదించుకోండి. మీ భర్త మీద ఆధారపడకండి. మీకు ఇంట్లో బాధ్యతలు లేవు, పిల్లలను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు మీ వ్యక్తిగత కోరికల కోసమే అని అర్థమవుతుంది. భార్య భర్త మధ్య వివాదం వస్తే, భర్తను శిక్షించడానికి ఇలా చేయడం సరైనది కాదు. మీరు కొంచెం లాజికల్ గా ఆలోచించండి" అని కోర్టు జడ్జి ఆమెకు చివాట్లు పెట్టారు.
అంతేకాదు కోర్టు "మీరు ఏయే ఖర్చుల కోసం ఈ డబ్బు అడుగుతున్నారో, దానికి సంబంధించిన బిల్లులు లేదా రశీదులు చూపించండి" అని అడిగింది. దానికి ఆమె సమాధానం చెబుతూ నెలకు 50 వేల రూపాయలు గడియారాలు, చెప్పులు, ఇంకా ఇతర అలంకార వస్తువులు కొంటానని పేర్కొంది. నెలకు 4 లక్షల రూపాయలు కాస్మెటిక్స్ వైద్య ఖర్చుల కోసం అవసరమని చెప్పింది.
ఆ మహిళ పిల్లల సంక్షేమం గురించి ఏమీ చెప్పలేదు. తన వ్యక్తిగత ఖర్చుల కోసమే ఈ డబ్బు అవసరం అని నిర్భయంగా పేర్కొంది. అయితే ఇలాంటి వివాదాలు కోర్టుల్లో పెరుగుతున్నాయి. భార్యలు భర్తల నుంచి ఎక్కువ డబ్బు ఇవ్వమని అడుగుతున్నారు.
చట్టం భార్యలను రక్షించడానికి ఉంది. కానీ కొంతమంది భార్యలు ఈ చట్టాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారని కొందరు అంటున్నారు. ఆమె కేసు సంచలనంగా మారింది. కోర్టు ఆమె చెప్పిన కారణాలకు కన్విన్స్ కాలేదు.