ఏపీ: పదవి కోసం పూజలు చేస్తున్న చిన్నమ్మ.. వరించేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షరాలుగా పురందేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఈమెను ముద్దుగా చాలామంది చిన్నమ్మ అని పిలుస్తూ ఉంటారు.  ఇమే రాజమండ్రి ఎంపీగా 10 ఏళ్ల తర్వాత ఇటీవలే గెలవడం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పదవి ఆశించిన కూడా దక్కలేదు.. ఇక రెండోసారి నామినేట్ పదవి అయిన దక్కుతుందని ఆశలు పెట్టుకున్న అది కూడా వచ్చేలా కనిపించడం లేదట. దీంతో పురందేశ్వరి హర్ట్ అయినట్లుగా బిజెపి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పదవి కోసం ప్రత్యేకమైన పూజలు చేయించినట్లుగా కూడా వార్త వినిపిస్తున్నాయి.

కొన్ని చోట్లకి రహస్యంగానే వెళుతున్నట్లు సమాచారం. ఇటీవలే రాజమండ్రి పరిధిలో మందపల్లి లో ఉండేటువంటి ఒక ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేయించిందట. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన రెండు రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. అలాగే శ్రావణ శుక్రవారం రోజున విజయవాడ దుర్గమ్మ ఆలయానికి కూడా చేరుకొని అక్కడ ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకి ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేకమైన ఖడ్గమా పూజలో పురందేశ్వరి పాల్గొన్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా ముందుగా చెప్పలేదట. ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత తమ మీడియా ప్రతినిధులతో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో కొంత మంది వెళ్లి పురందేశ్వరి ప్రత్యేకమైన పూజలను కూడా కవర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేయించడమే కాకుండా మందపల్లిలో ఉండేటువంటి శివలింగానికి అభిషేకం తరచూ చేస్తూ ఉండడం ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. రాజకీయ నేతలు పూజలు చేయించడం సర్వసాధారణమైన.. ఇలా పొద్దుపొద్దున్నే పూజలలో పాల్గొనాలనుకునే వారు ప్రత్యేకంగా ఏదో అనుసరించే చేస్తూ ఉంటారని రాజకీయ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిన్నమ్మ కేవలం ఒక ఎంపీగా మిగిలిపోతారా లేకపోతే పూజ ఫలం ఫలించి  ఏదైనా పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: