కొంతమంది రాజకీయ నాయకులకు అద్భుతమైన క్రేజ్ , గుర్తింపు ఉంటాయి. దానితో వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో వారికి అత్యున్నత స్థానం లభిస్తూ ఉంటుంది. అలాంటి వారు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత మంది ఉన్నారు. అలా తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారిన ఒకే లాంటి ప్రాధాన్యత , అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని మంత్రి పదవులలో కొనసాగిన వారిలో కడియం శ్రీహరి ఒకరు.
తెలుగుదేశం పార్టీ ద్వారా కడియం శ్రీహరి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. 1987 నుండి 1994 మధ్యకాలంలో వరంగల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కడియం శ్రీహరి పని చేశాడు. ఆ తర్వాత 1988 లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ చైర్మన్ గా పని చేశాడు. ఈయన 1994 లో తొలిసారిగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.
ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుదల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. అలాగే తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. 2013 లో కడియం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. కడియం శ్రీహరి 2015 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి గాబ్, విద్యాశాఖ మంత్రి గా కూడా పని చేశాడు. ఆయన 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు.
కడియం శ్రీహరి 2024 మార్చి 31 న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ పార్టీలో కూడా ఈయనకు మంచి స్థానం లభిస్తుంది.