బాబును చూసి అవన్నీ నేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్..?

Suma Kallamadi

2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పార్టీని విజయపథంలో నడిపించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఇటీవల ఓ పబ్లిక్ స్పీచ్‌లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి సంక్షోభ నిర్వహణ గురించి నేర్చుకుంటున్నట్లు చెప్పారు.
చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు మాత్రమే కష్టకాలంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు అందజేస్తోందని పవన్‌ కల్యాణ్‌ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ రాజకీయ నేతల పట్ల తాను చాలా వినయంగా వ్యవహరిస్తానని జేఎస్పీ అధినేత అన్నారు. చంద్రబాబు లాంటి వారిని చూసి నేర్చుకోవడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని పేర్కొన్నారు. తనకంటే ఎక్కువ జ్ఞానం, బాగా చదివిన వారిని అనుసరించడంలో తప్పేం లేదు. కొత్తగా రాజకీయాల్లోకి ఇచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూసి నేర్చుకుంటే నెక్స్ట్ సీఎం అయ్యాక ఆయనకి ఈ విషయాలు ఎంతో ఉపయోగపడుతాయి.
చంద్రబాబు మార్గనిర్దేశం చేయడంతోనే పవన్ తన రాజకీయ ప్రారంభంలో పర్ఫెక్ట్ పొజిషన్ పొందగలిగారు. ఈ పొజిషన్ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చుతున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ, దేశంలోనే అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్లలో ఒకరిగా పేరున్న చంద్రబాబును చూసి పవన్ మనసు విప్పి నేర్చుకుంటున్నారు. ఇది పవన్ భవిష్యత్ రాజకీయ ప్రయత్నాలకు కచ్చితంగా ఎంతో తోడ్పడుతుంది.
 మొదట్లో చాలామంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య ఎవరు వస్తాయని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చోట్ల కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. అలా కాంప్రమైజ్ అయితే చివరికి నెక్స్ట్ సీఎం ఆయనే అయ్యే అవకాశం ఉన్నా ఉంది చంద్రబాబు తన తర్వాత బెస్ట్ సీఎం ఆయన అని అనుకోవచ్చు. లేకపోతే కుమారుడికి ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు ఇది పవన్ కళ్యాణ్ కి నచ్చకపోతే ఆయన సొంతంగా పోటీ చేయవచ్చు చంద్రబాబు అధికారాన్ని ఎలాగో చూశాం కదా. కొత్త పవన్ అధికారం చూద్దామని ఏపీ ప్రజలు అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: