తలసాని శ్రీనివాస్ యాదవ్:పార్టీలు మారిన తలెత్తుకు తిరిగే పదవులే.!
- టీడీపీలో మంత్రిగా బీఆర్ఎస్ లో కూడా మంత్రే.!
- తలసానా మజాకా.?
తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్న తలసాని ఏ పార్టీలో ఉన్న ఘనుడే. కార్పొరేటర్ గా పోటీ చేసి, తన రాజకీయ అరంగేట్రం మొదలుపెట్టిన తలసాని చివరికి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలా తన రాజకీయంలో అంచలంచలుగా ఎదిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది ఆ వివరాలు చూద్దాం.
తలసాని రాజకీయం:
1986లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే ఏడాది మొండా డివిజన్ నుంచి ఎంసిహెచ్ కు కార్పోరేటర్ గా పోటీ చేశాడు. కానీ జనతాదళ్ అభ్యర్థి టీ పద్మారావు గౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1994లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మేరీ రవీంద్రనాథ్ ను ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఐదేళ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి చేసిన తలసాని 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలోనే ఆయన టాలెంట్ ను గుర్తించిన చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కూడా అందించారు. అలాంటి తలసాని 2004లో మళ్లీ పోటీ చేశాడు.ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టీ పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలామంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.