హైదరాబాద్ లోని ఆ ఏరియాలో గజం రూ.20 లక్షలు.. కాసుల వర్షం కురిపిస్తున్నాయిగా!
పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగం బజార్ లో భూముల ధర రెట్టింపు విలువ పలుకుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. గత పదేళ్లలో బేగం బజార్ లో భూముల విలువ ఊహించని స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే ఇక్కడ భూముల ధరలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటాయో అనే చర్చ సైతం జరుగుతుండటం కొసమెరుపు.
హైదరాబాద్ లో భూములపై పెట్టుబడులు పెట్టే వాళ్లు వేగంగా పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భూములపై పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లు మాత్రం హైదరాబాద్ అంచనాలను మించి లాభాలను అందిస్తోంది. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో గజం కొనుగోలు చేయాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్తులో అమరావతి కూడా హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ధి చెందడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి నారాయణ తాజాగా మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అమరావతి ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా నిలుస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో చూడాల్సి ఉంది. హైదరాబాద్ నగరంను మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సైతం ప్రయత్నిస్తోంది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.