పార్టీ మారిన వదలని మంత్రి పదవి.. మినిస్ట్రీతోనే చరిత్ర సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి?

praveen
సాధారణంగా రాజకీయాలు అన్న తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీ జంపింగ్లు జరుగుతూ ఉంటాయి. ఒక పార్టీ తరపున గెలిచినవారు ఇక అధికార పార్టీలోకి వెళ్లడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తే ముందు ఆ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం చేస్తూ ఉంటారు కానీ కొంతమంది రాజకీయ నాయకుల విషయంలో మాత్రం ఇలా జరగదు. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్లిన అక్కడ తప్పకుండా మంత్రి పదవి దక్కించుకుంటారు.

 అలాంటి వారిలో సబితా ఇంద్రారెడ్డి కూడా ఒకరు. ఆమె ఒక సాదాసీదా గృహిణి. రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. భర్త ఇంద్రారెడ్డి రాజకీయాలలో రాణిస్తున్న సమయంలో కేవలం ఇంటికి వచ్చిన వారిని ఆప్యాయతతో పలకరించడమే ఆమె పని. ఇలా రాజకీయాలకు అసలు సంబంధమే లేని సబితా ఇంద్రారెడ్డి భర్త ఇంద్రారెడ్డి మరణానంతరం ఉప ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. భర్త మరణానంతరం 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో  తొలిసారిగా చేవెళ్ల శాసనసభ నుంచి విజయం సాధించి శాసనసభలోకి అడుగుపెట్టారు.

 ఇక 2009 శాసనసభ ఎన్నికల్లోను మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2004 -09 కాలంలో ఏకంగా గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు సబితా ఇంద్రారెడ్డి. ఇక 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రి పదవిని చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోం మంత్రిగా చరిత్ర సృష్టించారు. 2014లో కొడుకు కోసం పోటీకి దూరంగా ఉన్న సబిత ఇంద్రారెడ్డి.. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే బిఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఆమెకు సముచిత  గౌరవం దక్కింది. ఏకంగా కెసిఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సబిత ఇంద్రారెడ్డి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. ఇలా సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిన మంత్రి పదవి మాత్రం వరిస్తూనే వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: