సోషల్ మీడియా స్టార్ గా రోజా: రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి..!
- సోషల్ మీడియాలో కూడా టాప్.
- ట్రోలింగ్ లో నెంబర్ వన్!
రోజా తెలుగు సినిమా ప్రపంచంలో విరబూసిన రోజాలా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించింది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా హీరోలతో సమానంగా చేసి అదరహో అనిపించింది రోజా. అలాంటి ఈమె రంగుల కళా ప్రపంచం నుంచి రాజకీయ కళా ప్రపంచంలోకి వచ్చింది. ఇక్కడ కూడా అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంత్రి స్థాయి దాకా ఎదిగింది. అలాంటి రోజా సినిమాల్లో ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో స్టార్. ఏదో ఒక రకంగా రోజా మీద రోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమెకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి రోజా సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించేది, ఆమెపై ట్రోలింగ్ ఎలా జరిగేవి రాజకీయ ప్రస్థానం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రోలింగ్ రోజా :
రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి . కానీ ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తుపట్టారు. కానీ ఆర్కే రోజా సెల్వమణి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. తిరుపతి దగ్గరలోని చిన్న పల్లెటూరులో పుట్టిన రోజా తెలుగు, తమిళ, భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అలాంటి ఈమెను తమిళ సినిమా దర్శకుడు సెలవమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కీలకమైన స్థాయికి ఎదిగింది. తనను సినిమాలకు పరిచయం చేసిన శివప్రసాద్ భరోసాతో రాజకీయాల్లోకి వచ్చింది. అంటే ఆమె రాజకీయాల్లో పోటీ చేద్దామని రాలేదు టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి ఆమె వచ్చింది. ప్రచారంలో ఎంతో గుర్తింపు పొందిన రోజా, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారట. ఆ తర్వాత టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2004 నగరి నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కానీ రెండవసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి మీద పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఇలా రెండుసార్లు ఆమె ఓడిపోవడానికి టిడిపి కారణమని తెలుసుకున్న రోజా, నియోజకవర్గాల మార్పు వల్లే ఓడిపోయానని గ్రహించింది.