అక్కడ రైతులే బీజేపీని ఓడిస్తున్నారా... మోడీ ఇది నీకు అసలు ఆట..!
ఇక్కడ కాంగ్రెస్ - ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. హర్యానాలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికలలో ఏకంగా ఐదు స్థానాలు గెలుచుకుని పంచుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 20 నుంచి 43 శాతానికి పెరిగింది అంటే అక్కడ కాంగ్రెస్ తిరుగులేని పొజిషన్‌కు చేరుకుందని చెప్పాలి. హర్యానాలో రైతులదే గెలుపు ఓటములలో కీలక పాత్ర. బిజెపిపై రైతులలో ఎంత అసంతృప్తి ఉందో పార్లమెంటు ఎన్నికలు సాక్షిగా బయటపడింది. పైగా అక్కడ యువత ఎక్కువగా సైన్యంలోకి వెళుతూ ఉంటారు. అగ్ని వీర్ పథకంపై యువతలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగిన హర్యానాలో రైతు సమస్యలే హైలెట్ అవుతూ ఉంటాయి. ఇక సామాజిక సమీకరణలు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాట్ ఓటును తేల్చేందుకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ - జాట్ దళిత ఓటు బ్యాంకు పై ఆశలు పెట్టుకుంది. ఏది ఏమైనా హర్యానా ఎన్నికలలో బిజెపి విజయం సాధించకపోతే అది కేంద్రంలోని ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ హరియానాలో విజయం సాధించాలని బిజెపి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది.