రికార్డు స్థాయిలో దుబాయ్‌కి క్యూ కడుతున్న ఇండియన్స్..?
ఇటీవల కాలంలో దుబాయ్ కి వెళ్తున్న భారతీయ యువతి యువకుల సంఖ్య బాగా పెరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఏకంగా 35 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. నిజానికి దుబాయ్ నగరంలో పనిచేసే వాళ్ళలో ఆ దేశస్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఉదాహరణకి ప్రతి నగరంలో 23 మంది ఉద్యోగులలోని ఒక్క ఉద్యోగి మాత్రమే దుబాయ్ కి చెందిన వాడవుతాడు. 22 మంది ఇతర దేశస్థులు కావడం విశేషం. ప్రపంచంలోనే అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉండటంవల్లే దుబాయ్ అంతగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతుంటారు. 1981 నుంచి 1996లో మధ్య పుట్టిన ప్రజలను దుబాయ్ బాగా ఆకట్టుకుంటోంది. అవేవో తెలుసుకుందాం.
* విమానంలో ఇండియా నుంచి దుబాయ్‌కి కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా చీప్. వీసా ఈజీగా లభిస్తుంది. చదువుకోవడానికి కూడా చాలా కాలేజీలు దుబాయ్‌లో ఉన్నాయి. ఇక్కడ స్టడీ చేస్తూనే మనీ కూడా సంపాదించొచ్చు.
* దుబాయ్‌లో హెరియట్-వాట్, బిర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యూరోప్ విశ్వవిద్యాలయం లాంటి ప్రపంచ ప్రసిద్ధ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చదువుకోవడానికి ఖర్చు చాలా తక్కువ. ఉదాహరణకు, అమెరికా లేదా యూరోపియన్ దేశాలతో పోలిస్తే, ఇక్కడ బ్యాచిలర్స్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదవడానికి సుమారు 17 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.
* దుబాయ్‌లో చదువుకునే విద్యార్థులు, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చే వరకు చదువు కూడా కొనసాగించి, పార్ట్‌టైం ఉద్యోగం కూడా చేయవచ్చు. అంతేకాకుండా, ప్రపంచ నలుమూలల నుండి వచ్చే యువకులు గ్రీన్ వీసా (5 సంవత్సరాల వరకు), స్టాండర్డ్ వర్క్ వీసా (2 సంవత్సరాల వరకు) లాంటి వివిధ ఉద్యోగ వీసాలను పొందవచ్చు.
* ఇక్కడ సగటు వార్షిక జీతం చాలా ఎక్కువ. సుమారు 23 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అంతేకాకుండా, నేరాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, డబాయీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు తమ కుటుంబాలతో కలిసి స్థిరపడటానికి చాలా మంచి ప్రదేశం.
దుబాయ్ అనేది వ్యాపారాలు చేయడానికి చాలా మంచి ప్రదేశం. ఎందుకంటే ఇది యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాలకు చాలా దగ్గరగా ఉంది. అంటే, వ్యాపారాలు తక్కువ ఖర్చుతో ఇక్కడ వ్యాపారం చేయవచ్చు. అందుకే దుబాయ్ విమానాశ్రయం యువకులు ఎక్కువగా ప్రయాణించే అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది.
ఫైనాన్స్ టెక్నాలజీ, ఆన్లైన్ వ్యాపారం, వ్యవసాయ సాంకేతికత, గేమింగ్, వైద్య పర్యటన, ఆరోగ్యం, రవాణా, పునరుత్పాదక శక్తి వంటి రంగాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి, 2023లో దుబాయ్‌కి విదేశీ దేశాల నుండి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి.