2029 ఎన్నికలే కూటమి వైసీపీ టార్గెట్.. గెలిచిన పార్టీకి మాత్రమే భవిష్యత్తు ఉంటుందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014, 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూల ఫలితాలు రాగా 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. 2029 ఎన్నికలే కూటమి వైసీపీ టార్గెట్ కాగా రాష్ట్రంలో గెలిచిన పార్టీకి మాత్రమే భవిష్యత్తు ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2029 ఎన్నికలతో చంద్రబాబు రాజకీయాలకు దూరమయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
 
మరోవైపు వైసీపీకి ఒక విధంగా ఈ ఎన్నికలే చివరి ఛాన్స్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి, వైసీపీలకు 2024 ఎన్నికలకు మించి 2029 ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలను అటు కూటమి ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. రాష్ట్రంలో గెలవడం కోసం ఇరు పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలను మొదలుపెట్టాయి.
 
కూటమి ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే గెలుపును నిర్దేశించనున్నాయని సమాచారం అందుతోంది. 2029 ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే మాత్రం పవన్, లోకేశ్ లలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇచ్చిన హామీలలో కొన్ని హామీలను అమలు చేయగా మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో కూటమి సత్తా చాటే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు తన వ్యూహాలతో ఇతర రాజకీయ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో దేశంలోనే చక్రం తిప్పే స్థాయికి ఎదగాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. ప్రజల మద్దతు సైతం ఉండటం బాబుకు ప్లస్ అవుతొంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: