జంపింగ్ జపాంగ్ నేతలు: పార్టీలు మారిన 'తుమ్మల' కి ఫలితం పక్కా.. అక్కున చేర్చుకున్న టిడిపికే పంగనామాలు.!

Pandrala Sravanthi
-ఖమ్మం జిల్లాలో తిరుగులేని లీడర్.
- పార్టీ ఏదైనా తుమ్మల మార్క్ అమోఘం
- జంపింగ్ అయిన జన ఆదరణ తగ్గలే.?


ప్రస్తుతం కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల రీత్యా రాజకీయ పదవుల కోసం పార్టీలు మారుతూ ఉంటారు. ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేసిన తప్పనిసరిగా వారి ప్రాంతాల్లో గెలుస్తూ ఉంటారు.  దీనికి ప్రధాన కారణం వారు చేసే మంచి పనులు ప్రజలతో మమేకమైన తీరు కావచ్చు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లిన అద్భుతమైన పదవి పొందడంలో ముందంజలో ఉంటారు. అలాంటి తుమ్మల ఇప్పటివరకు తన పొలిటికల్ కెరియర్ లో ఎన్ని పార్టీలు మారారు ఏ ఏ పదవులు అలంకరించారు అనే వివరాలు తెలుసుకుందాం.
జంపింగ్ వీరుడు:
ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం చాలా వెరైటీగా ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉన్న ఆ రాజకీయ పార్టీలను తన చేతిలో చక్రంలా తిప్పుకుంటారు. టిడిపి పార్టీ నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ వరకు క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్ది కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే గొప్ప రాజకీయ వేత్త అని చెప్పవచ్చు. 1985 సెప్టెంబర్ లో చర్ల మండలం ఏటుపక్క గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తుమ్మల నాగేశ్వరరావు  తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు 1982 లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మొదటిసారి ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో  సత్తుపల్లి నియోజకవర్గం టిడిపి  నుంచి పోటీ చేసి అద్భుత మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 1985, 1994, 1999లో ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 

సత్తుపల్లి వాస్తవ్యుడు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాల రిజర్వేషన్ల మార్పుల కారణంగా  2009 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి యూనిస్ సుల్తాన్, జలగం వెంకట్రావులను ఓడించారు.  ఇక ఇదే తరుణంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి పొందారు. అలా కొన్నాళ్లపాటు కొనసాగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు 2014లో  కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.  ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో అతను పార్టీకి రాజీనామా చేసి కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. ఇక 2023లో జాతీయ కాంగ్రెస్ లో చేరిపోయాడు. ఇదే ఏడాది ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పై దాదాపు  50 వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ లో కూడా ఆయనకు మంత్రి పదవి వచ్చింది.  ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో వ్యవసాయం మార్కెటింగ్, సహకార చేనేత మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా ఆయన పార్టీలు మారిన నియోజకవర్గాల్లో పరపతి మాత్రం తగ్గించుకోకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. అందుకే ఎన్ని పార్టీలు చేంజ్ అయిన కార్యకర్తలు మాత్రం తనకు అండగా నిలిచి గెలిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: