మంత్రి రామ్మోహన్: విద్యాశాఖ విషయంలో ఎవ్వరి మాట వినని లోకేష్..?

FARMANULLA SHAIK
ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా శాఖను తీసుకోవద్దని నారా లోకేశ్ కు చాలామంది చెప్పారని, కానీ ఆయన దాన్ని ఓ సవాల్ గా తీసుకుని విద్యాశాఖను చేపట్టారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. లోకేశ్ విద్యాశాఖను మోజుతో కాకుండా, ఓ చాలెంజ్ గా స్వీకరించారని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చింది... ఇంకా సమస్యలపై స్పందించలేదు ఏంటని అనిపించవచ్చని, కానీ రాష్ట్రం చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, సచివాలయానికి వచ్చి చూస్తే రాష్ట్రం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. టీచర్లు కొంచెం ఓపిక పట్టాలని, జీవో నెం.117 సహా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులకు అన్ని విధాలా గౌరవం ఇచ్చే నేత చంద్రబాబు అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలో పీఆర్‌టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.టీచర్స్‌కి అన్ని విధాలా గౌరవం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ర్ట అభివృద్దికి అంతా సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కోరారు. రానున్న రోజులలో శ్రీకాకుళం జిల్లాకి శాశ్వత కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. యువకుడినైన తాను కేంద్ర మంత్రి అయ్యానంటే సిక్కోలు ప్రజల చలవేనని స్పష్టం చేశారు.క్లాస్ రూంలో ఉంటే పరిస్థితులు తెలుస్తుందో లేదో కానీ, సచివాలయంలో కూర్చుంటే బాగోతం తెలుస్తుందన్నారు. చాలా పెద్ద ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టిపెడుతున్నారని ఆయన చెప్పారు. కాస్త సమయం ఇస్తే జీవో 117 నుంచి ప్రతీ సమస్య పరిష్కరిస్తాంరని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: