కష్టాల్లో జగన్... మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి... చాలా దారుణంగా తయారయింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి ఎవరు ఊహించని తక్కువ సీట్లు వచ్చాయి. ఏపీలో కనీసం ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీకి... 70 నుంచి 80 సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం 11 సీట్లు మాత్రమే వైసిపి పార్టీకి రావడం... మనం చూశాం. దీంతో ప్రస్తుతం.. వైసీపీ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే వైసిపి నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కష్టాలను చూసి... రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ప్రశాంత్ కిషోర్ మీటింగ్  కాబోతున్నారట.  ఇకపై మళ్లీ వైసీపీ పార్టీ కోసం పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
 
గతంలోనే వైసీపీ పార్టీకి సపోర్ట్ గా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ చాలా కష్టపడి వైసిపి పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి కష్టం అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కారణంగా వైసిపి పార్టీ ఆ ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మరియు ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

దీంతో వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2024 కంటే ముందు... తెలుగుదేశం కోసం పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఫలితంగా ఏపీలో వైసిపి ఓడిపోయి... తెలుగుదేశం కూటమి అఖండ విజయం  నమోదు చేసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ కిషోర్ బ్యాక్ టు హోం అంటున్నారు. జగన్ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకువస్తానని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తిగా లేనట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ లేకుండానే తాను మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారట. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: