* సీఎం కాకముందు రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి విమర్శలు
* పీసీసీ పదవి కొన్నాడని రేవంత్ రెడ్డి పై ఆరోపణలు
* బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాడని రాజగోపాల్ రెడ్డి పై వ్యతిరేకత
* రేవంత్ సీఎం అయ్యాక మంత్రి పదవి కోసం పొగడ్తలు
తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత పది సంవత్సరాల గులాబీ పార్టీ పాలనలో... జరగని కొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రతిపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెంల నేతలు తయారవుతున్నారు. మొన్నటివరకు తనంటే తాను కాంగ్రెస్లో నెంబర్ 2 అని కొంతమంది జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో తమకంటే తమకు మంత్రి పదవి కావాలని కొంతమంది... విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు.. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని... మొదటినుంచి డిమాండ్ ఉంది. అంతేకాదు హోం మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి వస్తుందని కూడా కొంతమంది అంటున్నారు. అయితే దీన్ని రేవంత్ రెడ్డి కాస్త వ్యతిరేకిస్తున్నారని కూడా కొంతమంది చర్చిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా విమర్శలు చేశారు.
తెలంగాణ ద్రోహి అని, పిసిసి పదవిని కొన్నాడని కూడా మండిపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఆయనను జోకే ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి. ఎంపీ సీటు గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానని... పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాన రచ్చ చేశారు. అంతేకాదు అధికారులపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి లాగా రెచ్చిపోతున్నారు.
మంత్రి కాకముందే తన అధికారాలను వినియోగించుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకూడదని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే సమయంలో ఉత్తంకుమార్ రెడ్డి తన భార్య మంత్రి పదవి కోసం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా మంత్రి పదవి రాకపోతే మళ్లీ రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది.