జనసేన మహిళా లీడర్ చైతన్యకు ఆ పదవి ఫిక్స్ ..?
టిడిపి, జనసేన, బిజెపి పొత్తు కుదుర్చుకోవడంతో.. ఇప్పుడు ఆ కూటమి అధికారంలోకి రావడంతో.. మూడు పార్టీలకు చెందిన నాయకులు ఈ పదవిపై కన్నేసారు. ఈ పదవి ఆశిస్తున్న వారిలో.. చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి టిడిపి నాయకుడు డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణరెడ్డి, స్వర సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు.. ఆయన తనయుడు నారా లోకేష్ వివరంగా కసరుత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తుడా చైర్మన్ పదవిని జనసేన నాయకురాలు. టిటిడి మాజీ చైర్మన్.. దివంగత డీకే ఆది కేశవుల నాయుడు మనవరాలు చైతన్యకు ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరారు. పిఠాపురంతో పాటు.. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో టిడిపి, జనసేన అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయడంతో పాటు.. ఆర్థికంగా తన వంతుగా ఖర్చు పెట్టారు. పైగా ఆదికేశవులనాయుడు కుటుంబం అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. ఆదికేశవుల నాయుడు చంద్రబాబు దయతోనే చిత్తూరు ఎంపీగా గెలిచారు. అనంతరం ఆయన భార్య డీకే సత్య ప్రభ 2014లో చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆమెకు రాజంపేట ఎంపీ సీటు ఇవ్వగా ఓడిపోయారు. ఆయన కుటుంబం రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటారు. అందుకే చైతన్యకు పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు లోకేష్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.