గల్లా మళ్లీ యాక్టివ్‌..ఆ పదవిపై కన్ను ?

Veldandi Saikiran
రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు గల్లా జయదేవ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. గత పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గల్లా జయదేవ్ ఏదైనా సంగతి మనందరికీ తెలిసిందే. 2014 అలాగే 2019 ఎన్నికల్లో వరసగా గల్లా జయదేవ్.. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా గుంటూరు నుంచి.. 10 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించారు గల్లా జయదేవ్.
 

అయితే 2019 తర్వాత జరిగిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీ చేయండి సంగతి తెలిసిందే. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలలో కంటే ప్రముఖ పారిశ్రామికవేత్తగా గల్లా జయదేవ్ కు మంచి పేరు ఉంది. ప్రిన్స్ మహేష్ బాబు బంధువు కూడా. అమర రాజా  బ్యాటరీ ఓనర్ గల్లా జయదేవ్ కావడం విశేషం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరరాజ బ్యాటరీ కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని గల్లా జయదేవ్ ప్రతిపాదనలు తీసుకున్నారు.
 

కానీ జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో కేటీఆర్ రంగంలోకి దిగి... అమరరాజ కంపెనీని తెలంగాణకు తీసుకువెళ్లారు. దీంతో 7,500 కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణలో పెట్టారు గల్లా జయదేవ్. అయితే 2024 కంటే ముందు పాలిటిక్స్ కు బై చెప్పిన గల్లా జయదేవ్... మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
 

గల్లా జయదేవ్ కు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది. అందుకే మళ్ళీ ఆయన రాజకీయాల్లో.. ఆక్టివ్ కావాలి అనుకుంటున్నారట. అంతేకాదు రాజ్యసభ సీటు గల్లా జయదేవ్ కు ఇచ్చేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు. 2026 సంవత్సరం నాటికి రాజ్యసభ సీట్లు ఏపీలో ఖాళీ అవుతాయి. అప్పుడు టిడిపి నుంచి చాలామంది గెలిచే ఛాన్స్ ఉంటాయి. అందులో గల్లా జయదేవ్ కూడా ఉంటారని సమాచారం. అంటే 2026 వరకు గల్లా జయదేవ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: