జగన్ ఫ్యామిలీలో షర్మిల, విజయమ్మ తర్వాత నెక్ట్స్ వికెట్ ఎవరిదంటే..?
కార్యక్రమంలో తల్లి వైయస్ విజయలక్ష్మి, చెల్లి వైయస్ షర్మిల ఇప్పటికే జగన్కు దూరం అయ్యారు. బ్రదర్ అనిల్ తో పాటు.. జగన్ బంధువులలో మోహన్ బాబుతో మొదలుపెట్టి చాలామంది ఇప్పుడు జగన్ వెంట లేరు. ఈ క్రమంలోనే జగన్కు అత్యంత సన్నిహితుడు బంధువు అయిన మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఇప్పుడు జగన్కు దూరం కానున్నారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న బాలినేని.. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్నారా ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పార్టీ నేతలను దూరం పెట్టిందని.. ఈవీఎంల అమలుపై తను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని వాపోయారు.
కనీసం తన గోడు ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరని.. అందుకే ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నానని.. బాలినేని చెప్పారు. తాను జనసేనలోకి వెళుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని బలినేని ధర్మగర్బంగా వ్యాఖ్యానించారు. అయితే తనకు ప్రజల మద్దతు ఉందని.. తాను ఎవరికి భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. పార్టీ తనను పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. వారి కోసం తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. ఏదేమైనా బాలినేని కామెంట్లు చూస్తుంటే బాలినేని వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదన్నది క్లారిటీ వచ్చేసింది.