కేసీఆర్ ఏజ్ బార్.. సంక్షభంలో గులాబీ పార్టీ.. కాపాడే వాళ్ళే లేరా ?
* పార్టీ ఓడిపోయిన కూడా బయటకు రాని కెసిఆర్
* కెసిఆర్ తో మాట్లాడాలంటే భయపడుతున్న క్యాడర్
* ఇప్పటికే 70 ఏళ్ళు దాటిపోయిన గులాబీ బాస్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ప్రస్తుతం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారాన్ని కేసీఆర్ కోల్పోవడం... అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా జీరోకు టిఆర్ఎస్ పార్టీ పడిపోవడం జరిగింది. అటు టిఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపు కావడం కూడా కేసీఆర్ను వేధిస్తోంది.
ముఖ్యంగా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలు పాలు కావడం కూడా... కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మింగుడు పడడం లేదు. ఇన్ని కష్టాల మధ్య కేసీఆర్ పార్టీని నడపడం చాలా కష్టతరం అయిపోయింది. ఇటు 70 సంవత్సరాలు దాటిన కేసీఆర్... యూత్ లాగా పని చేయలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. జారిపడ్డ కేసీఆర్ ఆరోగ్యం కూడా... అంతంత మాత్రమే ఉందని చెబుతున్నారు.
ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యను కేసీఆర్ ఎదుర్కొంటారో తెలియని పరిస్థితి ఉంది. ఇక నిత్యం కెసిఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండటం కూడా... గులాబీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టుతోంది. ఇన్ని కష్టాల నడుమ కేసీఆర్ పార్టీని నడపడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీని హరీష్ రావు లేదా కేటీఆర్ లలో ఎవరో ఒకరికి అప్పగించాలని కొంతమంది కోరుతున్నారు.
రాజకీయ విశ్లేషకులు అయితే డైరెక్ట్ గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని అంటున్నారు. కేటీఆర్ కంటే టిఆర్ఎస్ పార్టీని నడపగల సత్తా ఎక్కువగా హరీష్ రావుకు ఉందని కొంతమంది అంటున్నారు. హరీష్ రావుకి ఇప్పుడే బాధ్యతలు అప్పగిస్తే 2028 వరకు కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొంతమంది అంటున్నారు.