గుంటూరులో వైసీపీ ఖాళీ.. ఖాళీ... కొత్త నాయకుల కోసం పేపర్ ప్రకటన ఇస్తారా ?
ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్ రెడ్డికి ఐదేళ్లు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ జనాలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కేవలం 11 అసెంబ్లీ ... నాలుగు ఎంపీ సీట్లకు మాత్రం పరిమితం చేశారు. జగన్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఎన్నికలలో పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత వైసిపి నుంచి పలువురు కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పలువురు సీనియర్లు ... మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలతో వైసీపీలో పెద్ద గందరగోళం నెలకొంది.
2019 ఎన్నికలలో ఘనవిజయం సాధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన వైసీపీ నుంచి ఇప్పుడు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ రావు - కిలారు వెంకట రోశయ్య రాజీనామా చేయిగా .. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత అదే బాట పెట్టారు. ఇక ఈరోజు బాపట్ల జిల్లా అధ్యక్షుడు ... రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరాలని తీసుకున్న నిర్ణయం వైసిపి నేతలను మరింత కలవరపాటుకు గురిచేస్తుంది.
ఎన్నికలకు ముందే వైసిపి బీసీ నేత అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి సైతం పార్టీ మారిపోయారు. ఏది ఏమైనా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ... మాజీ మంత్రులు ... కీలక నేతలు సైతం ఇప్పుడు వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. వారంతా మరో ఐదు ఆరు నెలలలో జిల్లా మొత్తం మీద వైసిపిని పూర్తిగా ఖాళీ చేసేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరి కొత్త నేతలు కావాలని వైసీపీ వాళ్లు ఏ పేపర్ ప్రకటనో ఇచ్చు కోవాల్సిన పరిస్థితి.