తెలంగాణ: పంచాయతీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్..!

FARMANULLA SHAIK
రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల ను ఆదేశించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ కూడా నిర్దిష్ట గ‌డువులోగా నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు.ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం మగిసి దాదాపు ఏడు నెలలు కావొస్తుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. అయితే గ్రామ పంచాయతీలకు 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల నిర్వహించలేదు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.ఇదిలా ఉంటే గ్రామపంచాయితీల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో బీసీ కమిషన్, చైర్మన్, సభ్యులను నియమించిన తర్వాత వాటి ద్వారా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఆరు రోజుల క్రితం జారీ చేసిందని.. దీని ఆధారంగా త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓటర్ల జాబితాను తయారు చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే  గ‌త ఎన్నిక‌ల్లో కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల ప్రకార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వహించాల‌నే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: