ఏపీ: పిఠాపురం మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం మహిలలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు.తన నియోజకవర్గం పిఠాపురం ఆడపడుచులకు సొంత నిధులతో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా చీర, అమ్మవారి ప్రసాదాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తి కర చర్చగా మారింది.పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో ఈ నెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో 12 వేల మందికి చీరలు, వ్రత పూజ సామాగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ పర్యవేక్షించారు.
ఈ పూజ కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్ల పైన ఆలయ అధికారులతో సమీక్షించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని.. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఈ 12వేల చీరల్లో.. 6వేల చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం దగ్గర పూజ ముగిసిన తర్వాత అందజేయనున్నారు. అయితే మిగిలిన 6వేల చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆడపడుచులకు అందజేయనున్నారు. వరలక్ష్మి వ్రతం కోసం ఆలయంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు.. ఈవో భవాని తెలిపారు. ఈ ఏడాది ఆలయం దగ్గర మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించామని.. మొత్తం మూడు టీమ్‌లుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేనా.. మజాకా నా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం పై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గం లోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం ఆడపడుచులందరికి ఈ బహుమానం అందజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: