అమెరికాకు కొడుకు...కేసీఆర్‌ సంచలన నిర్ణయం ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి... కాస్త అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీని... సమర్థవంతంగా ఓడించగలిగింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ... ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు... తెలంగాణ ప్రజలకు చెప్పి ఓట్లు అడుక్కుంది.
 

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. 6  గ్యారంటీలను  గాలికి వదిలేసింది. కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.... ప్రతిసారి చెప్పింది. అయితే మొన్న ఆగస్టు 15వ తేదీన 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
 

అయితే ఆ వ్యతి రేకతను క్యాచ్ చేసుకోవాలని... తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి,  గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు భారీ స్కెచ్ వేశారు. మళ్లీ రైతుల వద్దకు వెళ్లాలని చంద్రశేఖర రావు డిసైడ్ అయ్యారు. వచ్చే వారం నుంచే తెలంగాణ రైతులందరికీ వద్ద కు వెళ్లి...  పైన ఉన్న సమస్యలను వారి ద్వారా వినబోతున్నారు కేసీఆర్.
 

రుణమాఫీ తో పాటు రైతు భరోసా కూడా ప్రజలకు రాలేదు. అయితే వీటి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిల దీసేందుకు...  తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలలో సభలు అలాగే కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు  శుక్రవారం షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రకటించింది. కేటీఆర్ అమెరికాకు..  వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ రైతుల కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ సభల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను కేసీఆర్ తన ప్రసంగంతో చీల్చి చెండాడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: