ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి... చాలా దారుణంగా తయారయింది అన్న సంగతి తెలిసిందే. రోజుకు ఒక లీడర్ పార్టీ మారుతున్నారు. ముఖ్యంగా మొదటగా వైసిపి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత... టైం చూసుకొని ఇతర పార్టీలోకి వెళ్తున్నారు నేతలు. ఇలాంటి నేపథ్యంలోనే వైసిపి ద్వారా రాజ్యసభ పదవులను అనుభవించిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇద్దరూ తమ పదవులకు తాజాగా రాజీనామా చేశారు.
గురువారం రోజున మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్రావు ఇద్దరూ వైసీపీ పార్టీతో పాటు రాజ్యసభ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. ఇందులో మోపిదేవి వెంకటరమణ టిడిపి పార్టీలోకి వెళ్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన కూడా మీడియా వేదికగా ప్రకటించేశారు. అటు బీద మస్తాన్ రావు మాత్రం బిజెపి వైపు చూస్తున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాలలో పనిచేయాలని ఆసక్తిగా ఉందని... ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది.
ఇక ఇలాంటి నేపథ్యంలో... రాజ్యసభ చైర్మన్ కూడా... వెంటనే మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్ రావు రాజీనామా పత్రాలపై ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ నుంచి 2 రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో... కచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం కూటమి ఆ రెండు రాజ్యసభ సీట్లను దక్కించుకోనుంది. అయితే ఇప్పటికే ఈ రాజ్యసభ సీట్ల కోసం ఇద్దరినీ ఫైనల్ చేశారట తెలుగుదేశం కూటమి ప్రభుత్వ సభ్యులు.
మోపిదేవి వెంకటరమణ స్థానంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఫైనల్ అయినట్లు సమాచారం అందుతుంది. ఆయన మళ్లీ పాలిటిక్స్ లోకి రియంట్రి ఇస్తున్నారని మొన్ననే వార్త వచ్చింది. ఇక ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట. మస్తాన్ రావు స్థానంలో... మెగా బ్రదర్ నాగబాబు కు అవకాశం ఇవ్వనున్నారట. ఈ మేరకు జనసేన అలాగే తెలుగుదేశం మధ్య ఒప్పందం కూడా కుదిరిందట.