కేసీఆర్ వెంట కడిగిన ముత్యంలా కడియం.. బిడ్డ కోసం కాంగ్రెస్ లోకి పయాణం.!

Pandrala Sravanthi
-వారసుల కోసం పార్టీల మార్పు.!
- చివరి నిమిషంలో కేసీఆర్ కు హ్యాండిచ్చిన కడియం.
- నమ్మిన కేసీఆర్ కు వెన్నుపోటు.

ఒకప్పుడు రాజకీయాలు, రాజకీయ నాయకులు ప్రజా సమస్యల కోసం పేద ప్రజల కోసం పనిచేసేవారు. ఏదైనా పార్టీ కోసం పనిచేస్తున్నారంటే కష్టం వచ్చినా నష్టం వచ్చిన అదే లైన్ లో ఉండేవారు. అధికారంలోకి వస్తే ప్రజాసేవ చేసేవారు ప్రతిపక్షంలోకి వస్తే ప్రజలకు అందాల్సిన పలాలపై పోట్లాడేవారు. కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల తీరే మారిపోయింది. ఎక్కడ చూసినా కుటుంబ రాజకీయాలు మొదలైపోయాయి. తండ్రి కొడుకులు, మనవళ్లు, ఇలా వాళ్లకి వారే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. అలాంటి వారి సొంత రాజకీయాల కోసం వేలాదిమంది ఓట్లు వేసిన ప్రజలను కూడా మోసం చేసి పార్టీలు మారుతున్నారు. అలా పార్టీలు మారిన నాయకుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కడియం శ్రీహరి. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి ఎంతో బాసటను అందించిన కేసీఆర్ పార్టీని వదిలి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి కారణాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
 కూతురు కోసం పార్టీల మార్పు:
 ప్రస్తుతం ఏ రాష్ట్రంలో చూసిన ఫ్యామిలీ పాలిటిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది.  ఫ్యామిలీ ప్యాకేజీల కోసం పార్టీలు మారుతున్న నేతలు ఎందరో మనకు కనిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.  సుదీర్ఘకాలం కేసీఆర్ వెంట ఉన్నటువంటి కడియం శ్రీహరి తన కూతురు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరికి కూతురుని ఎంపీగా కూడా గెలిపించుకున్నారు. అలాంటి కడియం శ్రీహరి గురించి కొన్ని విషయాలు చూద్దాం.
 రాజకీయ ప్రస్థానం:
 కడియం శ్రీహరి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చారు. ఆ పార్టీలోనే ఎన్నో పదవులు అలంకరించారు. ఇక 1994లో స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన హయాంలో విద్య, సాంఘిక సంక్షేమం, మార్కెటింగ్, నీటిపారుదల శాఖకు బాద్యతలు నిర్వహించారు.  ఇక తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో శ్రీహరి టిడిపికి రాజీనామా చేసి  టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కొన్నాళ్ళ పాటు టిఆర్ఎస్ లో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం సభ్యునిగా పనిచేశారు. ఆ తర్వాత  ఎమ్మెల్యేగా గెలిచి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే కేసీఆర్ కు నమ్మిన బంటుగా కడియం శ్రీహరి ఉన్నారు. వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంతో ఉండేది. ఎందుకంటే పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నది వీరే కాబట్టి ఏ విషయమైనా కేసీఆర్ కు నేరుగా చెప్పే ధైర్యం కడియం శ్రీహరికి మాత్రమే ఉండేది.

 కడియం శ్రీహరి టిఆర్ఎస్ పార్టీలో కీలక లీడర్ గా ఎదిగారు. కేవలం మంత్రి పదవి కాకుండా టిఆర్ఎస్ పార్టీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు.ఇక 2017 జనవరి 25న ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2018 వరకు పని చేశారు. ఇక మరోసారి 2023లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన కూతురు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని  ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్చార్జి దీప దాస్ మున్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి ఎంపీగా వరంగల్ టికెట్ తెచ్చుకున్నారు.  చివరికి ఆమెను కూడా ఎంపీగా గెలుపొందేలా ఎంతో కృషి చేశారు. ఈ విధంగా కడియం శ్రీహరి టిడిపిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: