ఒట్టు నేను పార్టీ మారను: జగన్ చేసిన తప్పే... పెండ్యంను పవన్ కు దగ్గర చేస్తుందా..?

FARMANULLA SHAIK
* జగన్ చేసిన తప్పుకు బలైన సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం.!
* పవన్ కు నువ్వు సరిపోవు అనేలా.. జగన్ వైఖరి.!
* ఎన్నికలకు ముందు తీవ్ర మనస్తాపం.!
(తూర్పు గోదావరి -ఇండియాహెరాల్డ్ ): పెండెం దొరబాబు 1959 జనవరి 12న  ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం గ్రామంలో జన్మించాడు.ఆయన స్థానికంగా డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు.పెండెం దొరబాబు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయి, 2004లో బీజేపీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొప్పన  మోహనరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామలకి ఆయన బీజేపీని వీడి 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పెండెం దొరబాబు వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం వైసీపీ పార్టీలో చేరి జగన్ వెంట నడిచారు.
2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుండి టికెట్ పొంది పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14992 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం చేసిన వ్యూహత్మక తప్పిదంలో పెండం దొరబాబు కూడా బలి అయ్యారు.కూటమి తరపున పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటి చేయడంతో వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండ్యం దొరబాబును కాదని వంగా గీతకు అవకాశం ఇచ్చి పవన్ పై పోటీకి దింపారు.దీనికి తోడు వంగా గీతా పార్టీ కార్యాలయాన్ని దొరబాబు ఇంటికి సమీపంలో ఏర్పాటు చేయడంతో దొరబాబులు అసంతృప్తి ఇంకా పెరిగింది. ఎన్నికల ముందే దొరబాబు పార్టీని విడాలని నిర్ణయించుకున్నప్పటికీ వైసిపి అధిష్టానం బుజ్జగించే పనులు చేపట్టింది.అయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికలలో తీవ్ర నిరాశతోనే దొరబాబు పనిచేశారు.

అయితే ఐదేళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉంటూ పార్టీ కోసం కష్టపడితే తనను పక్కన పెట్టడాన్ని దొరబాబు జీర్ణించుకోలేకపోయి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీకి రాజీనామా చేద్దాం అనుకోని ఇటీవల ఆగస్టు 7న తన రాజీనామాను అధిష్టాననికి పంపారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై కార్యచరణ ప్రణాళికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు సరిపోయే వ్యక్తి పెండం దొరబాబు కాదని వైసీపీ అధిష్టాన నిర్ణయించుకొని వంగ గీతను దింపడంతో అది కాస్త బెడిసి కొట్టింది. దాంతో దొరబాబు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోనే చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే దొరబాబుతో పాటు మూడు మండలాలలోని ఉన్న ఆయన అనుచరులు నుండి కూడా అదే సమాచారం అందింది.ఈ ఎన్నికల్లో జగన్ చేసిన తప్పుల్లో అతి పెద్ద తప్పుగా అభ్యర్థుల స్థానచలనం అని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు తానే అంత అనుకున్న జగన్ కు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: