టికెట్ దక్కలేదని పార్టీ మారిన యామిని బాల..!

Divya
•సింగనమల టికెట్టు ఆశించి భంగపడ్డ యామిని బాల
•టికెట్ దక్కలేదని పార్టీ నే మార్చేసింది గా
•నాడు చంద్రబాబుకు ద్రోహం.. నేడు జగన్కు ద్రోహం..

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. కూటమి , వైసీపీ  ఎవరికి వారు పోటీ పడగా , కూటమి అత్యంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసింది మాజీ ఎమ్మెల్యే యామిని బాల. తాను వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు తెలిపింది.  ఇంతకాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు,  అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
అసలు విషయంలోకి వెళ్తే,  ఈ ఎన్నికలలో వైసిపి నుంచి సింగనమల టికెట్ ఆశించి భంగపడ్డారు యామిని బాల. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె రాజీనామా చేశారు. 2014 ఎన్నికలలో టిడిపిలో ఉన్న యామిని బాల అక్కడ టిడిపి అభ్యర్థిగా సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు .అప్పుడు ఏపీలో టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2019 ఎన్నికలలో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకి బదులుగా కొత్తగా వచ్చిన బండారు శ్రావణి కి అవకాశం కల్పించడంతో.. అక్కడ తన కుమార్తెకు టికెట్ కావాలని చివరి వరకు టిడిపి ఎమ్మెల్సీగా పనిచేసిన శమంతకమని పోరాడినా , ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో టిడిపి ఎమ్మెల్సీ శమంతకమని , ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల స్థానిక ఎన్నికల సమయంలో టిడిపికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిపోయారు. ఇప్పుడు అక్కడ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కూడా మారిపోయారు.
ఇకపోతే ఎప్పటికప్పుడు టికెట్ ఆశించడం అక్కడ లభించకపోతే పార్టీ మారడం యామిని బాలకు అలవాటైపోయిందని అప్పట్లో చాలామంది కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం ఏ పార్టీలో చేరి ఎక్కడి నుంచి టిక్కెట్ వస్తుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా యామిని బాల టికెట్ ఆశించి భంగపడి వైసీపీకి గుడ్ బై చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: