వైసీపీకి బీద, మోపిదేవి రిజైన్..పార్లమెంట్‌కు గల్లా?
ఇకపోతే మోపిదేవి వెంకట రమణ కూడా తన ఎంపీ సభ్యత్వాన్ని వదులుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఆయన కొడుక్కి కూడా ఓ పదవి లభించనున్నట్లు తెలుస్తోంది. మోపిదేవి రాజ్యసభ పదవీ కాలం కూడా 2026 జూన్ 21వ తేది వరకూ ఉంది.
ఇప్పుడు రెండు రాజ్యసభ పోస్టులు ఖాళీ అవ్వడంతో వాటికి సంబంధించి త్వరలోనే ప్రకటన రానుంది. అయితే ఆ రెండు పోస్టుల కోసం టీడీపీ కూటమిలోని కొందరు కన్నేశారు. కానీ సీఎం చంద్రబాబు చూపు మాత్రం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. గల్లా జయదేవ్ ఇప్పటికే గుంటూరు నుంచి లోక్ సభకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికలకు ముందుగానే ఆయన పోటీ చేయకుండా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో గల్లా పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరో ఎంపీ సీటును జనసేన నేతకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పోస్ట్ ఖాయమని సూచనలు వినిపిస్తున్నాయి. నాగబాబు 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చూసినా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో నాగబాబు తప్పుకున్నారు. నాగబాబు త్యాగానికి ప్రతిఫలంగా ఎంపీ సీటును ఆయనకే ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నాగబాబు ఎంపీ అయితే ఇక కేంద్ర పదవి కూడా దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.