గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిన హైదరాబాద్‌ను ఇమేజ్‌ని మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని సీఎం సూచించారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుకున్నారు.గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యుత్ అందని సీఎం తెలిపారు. మండపాల్లో డీజే సౌండ్‌లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని సీఎం రేవంత్ అన్నారు.హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని ఇతర జలాశయాల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఏయే ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారో ముందుగానే సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందన్నారు. వినాయక నిమజ్జనం జరిగే సెప్టెంబరు 17న 'అనంత చతుర్దశి' ఉందని దాని ప్రాముఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని భాగ్యనగర ఉత్సవ సమితి కోరగా ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖను సీఎం ఆదేశించారు. డీజేలకు అనుమతివ్వాలని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ కోరగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. సుమారు 25వేల మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు.ఇదిలా ఉండగా వినాయక మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మండపాలకు దరఖాస్తు చేసుకుంటున్న నిర్వాహకుల నుంచి విద్యుత్ శాఖ 1000 రూపాయలు వసూలు చేస్తుందని, డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ కరెంటు పై తమకు ఎలాంటి అధికార ఉత్తర్వులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో నే మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరున్న హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కోరారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గతేడాది గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఓఆర్ఆర్ లోపల లక్షన్నర విగ్రహాలు ఏర్పాటు చేశారని ముందుగానే అనుమతి తీసుకుంటే ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తవన్నారు.