పవన్ దారిలోనే ఏపీ సీఎం.. టార్గెట్ అల్లు అర్జునేనా..?

Divya
2024 ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసిపి నేతకు సపోర్టు చేయడంతో..కూటమి కి సపోర్టుగా అల్లు అర్జున్ మాట్లాడలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అల్లు అర్జున్ ని నానా రకాలుగా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా మెగా వర్సెస్ అల్లుఅర్జున్ అన్నట్టుగా మారిపోయింది. దీంతో గత కొన్ని నెలలుగా వీటి మీద చర్చ జరుగుతూనే ఉంది. అంతా సద్దుమణుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతూ.. ఈ మధ్య హీరోలు  అందరూ చెట్లను నరకడం హీరోఇజం అయ్యింది.. కేవలం వాటి మీద తీస్తున్నారన్నడంతో ఒక్కసారిగా మళ్లీ వైర్యం రాసుకుంది.

దీంతో అల్లు అర్జున్ ఒక సినిమా ఈవెంట్లో తనకు ఇష్టమైతేనే వస్తాను లేకపోతే లేదు అన్నట్లుగా చెప్పడంతో మళ్లీ అల్లు ఫాన్స్, మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ మొదలయ్యింది.. చంద్రబాబు కూడా ఇటీవలే చెట్లను పెంచితే విపత్తి నుంచి తప్పించుకోవచ్చు నరకకూడదు అంటూ తెలియజేశారు.. ఇది కూడా అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహబంధం ఉన్న వారందరు అడిగితే చాలు సినిమా టికెట్లు పెంచేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం.

అలా కల్కి సినిమాకి కూడా అశ్వినిదత్ కు భారీగానే సహాయం చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య విభేదాలు ఉన్నందువలన పుష్ప-2 చిత్రానికి టికెట్ల పెంపు రేటు విషయం ఉండదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పుష్ప చిత్ర నిర్మాతలు మాత్రం ప్రముఖ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు మంచి స్నేహితులట. దీంతో ఈయన నుంచి అయినా కూడా సినిమా టికెట్ల పెంపు చేసుకొని అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా కేవలం కల్కి సినిమా నిర్మాత అశ్వనీ దత్ మాత్రమే సపోర్టివ్ గా మాట్లాడారు.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి కూడా టికెట్ల రేటు పెంపు అనుమతి వస్తుందా రాదా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: