బాలయ్య సినీ స్వర్ణోత్సవం.. బాలయ్యకు కంచుకోటగా మారిన హిందూపురం.. వారి వల్లే సాధ్యమా..?

Divya
•తండ్రి , అన్నల గౌరవాన్ని నిలబెడుతున్న బాలయ్య..
•సొంత డబ్బుతో హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డ బాలయ్య
•బాలయ్యకు కంచుకోటగా మారిన హిందూపురం..

(ఆంధ్రప్రదేశ్ ఇండియా హెరాల్డ్)
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.  1974లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం తాతమ్మకల చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ నేడు అంచలంచెలుగా ఎదుగుతూ.. స్టార్ సీనియర్ హీరోగా చలామణి అవుతున్నారు. సినీ జీవితంలో అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న అరుదైన నటుడిగా రికార్డు సృష్టించారు బాలయ్య.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మాస్ హీరోగా ఆడియన్స్ కు  చేరువైన ఈయన ,రాజకీయంగా కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. ఈసారి ఏకంగా హ్యాట్రిక్ కొట్టాడు అంటే అక్కడి ప్రజలు ఈయనకు  ఏ విధంగా నీరాజనాలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే సెప్టెంబర్ ఒకటవ తేదీన సినీ ఇండస్ట్రీలో అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సినీ పెద్దలు.  ఈ నేపథ్యంలోనే ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
అందులో భాగంగానే రాజకీయపరంగా బాలకృష్ణకు హిందూపురం కంచుకోటగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయన చేసిన సేవ అని చెప్పవచ్చు.  దాదాపుగా ఎవరైనా సరే తమ నియోజకవర్గానికి ప్రభుత్వం నుండి నిధులు అందితేనే తమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారు. కానీ హిందూపురం విషయంలో బాలయ్య పూర్తిగా విరుద్ధమని చెప్పవచ్చు.అక్కడి ప్రజలను సొంత మనుషులుగా భావించి,  ఏకంగా 90 కోట్ల రూపాయల తన సొంత డబ్బును వెచ్చించి హిందూపురం అభివృద్ధికి పాటుపడ్డారు.
ముఖ్యంగా ప్రత్యేక రోడ్ల నిర్మాణం, మున్సిపాలిటీ, ఉపాధి హామీ, వైద్య సదుపాయం, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశం ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలలో కూడా అటు ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు, యువతకు అందరికీ చేయూతగా నిలిచారు బాలయ్య. దీనికి తోడు వీరి తండ్రి నందమూరి తారక రామారావు అలాగే వీరి అన్నయ్య స్వర్గీయ నటుడు రాజకీయ నేత హరికృష్ణ కూడా ఇక్కడినుంచి పోటీ చేసి గెలుపొందారు. టిడిపికి కంచుకోటగా మారిన హిందూపురం నియోజకవర్గానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు బాలకృష్ణ. ఇక ఇక్కడ ఈయన తప్ప మరొకరు అధికారంలోకి రారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా బాలయ్య గొప్ప మనసే ఆయనను అక్కడ విజేయుడుగా తీర్చిదిద్దుతోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: