వైసీపీలోనే జగన్‌ శత్రువులు..నిజమెంత?

Suma Kallamadi
ఒకప్పుడు వైసీపీ అంటే పడిచచ్చే జనాలు ఉండేవారు. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో లేదు కాబట్టి. అయితే వైసీపీ ఓడిపోవడానికి కారణం ఆ పార్టీలో ఉండే కొందరు నాయకులని చాలా మంది చెప్పుకుంటున్నారు. వైసీపీలోనే కొందరు నాయకులు జగన్ పై పగ పెంచుకున్నారని చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యనే అందరికీ తెలుస్తూ వస్తోంది. తాజాగా రాజ్యసభకు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు సీటు ఇవ్వనప్పుడే తాను రాజీనామా చేయాలనుకున్నానని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే అందరూ పార్టీని వీడాలని అనుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదికూడా ఎన్నికల్లో ఓటమికి కారణమని అనిపిస్తోంది.
శత్రువులను కనిపెట్డడం అందరికీ ఈజీకాదు. అందులోనూ ఇంట్లోని శత్రువును కనిపెట్డడం అసాధ్యం. స్వపక్షంలోనే ఉండి అంతర్గతంగా శత్రువు అయిన వారిని గుర్తించడం అంత సులభమేమీ కాదు. రాజకీయ నాయకులంతా పార్టీతో సౌమ్యంగా ఉంటారు. అందరికీ మేలు చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ వారి కోరికలు తీరకపోతే మాత్రం అంతర్గత శత్రువులుగా మారుతారు. ఇదే వైసీపీ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది.
టికెట్లు రానివారు, మార్పులు చేసిన నియోజకవర్గాల్లోని వారు అందరూ జగన్ కు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. అందుకే 85 నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. జగన్ చేసిన మార్పులు కొందరు జీర్ణించుకోలేకపోయారు. పార్టీ వారి మేలు కోసమే అలా చేసినా పార్టీకి మాత్రం అంతగా మేలు జరగలేదని తెలుస్తోంది. చాలా మంది జగన్‌పై పగబట్టి అంతర్గత శత్రువులుగా మారారు. తమ స్వార్థం కోసం పార్టీని బలి చేశారు. ఇప్పుడు వారినందరినీ కూల్ చేయాలనుకున్నా వారు మారే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ సమయంలో ఎంత మంది జగన్‌తో నడిచి ముందుకెళ్తారోననేది తెలియాల్సి ఉంది. వైసీపీలో భారీ మార్పులు జరగాలి. అందరూ ఒక్కటిగా ఉంటేనే టీడీపీ కూటమిని ఎదుర్కొనే బలం వస్తుంది. లేదంటే పార్టీ చెల్లాచెదురు అవ్వడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: