పవన్ కళ్యాణ్ బర్త్డే కి.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..!
ఈ కార్యక్రమంలో జనసేన ,టిడిపి నాయకులు అంతా కూడా పాల్గొనాలని అలాగే కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఇటీవలే నర్సీపట్నం మండలంలో ధర్మసాగరంలో పింఛని పంపిణీ వ్యవహారంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు సైతం ఈ విషయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పింఛినిని పెంపు అమలు చేసిందని కూడా తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కచ్చితంగా పెంచినిని పంపిణీ చేస్తామని తెలియజేశారు.
రేపటి రోజున సెప్టెంబర్ ఒకటి అవ్వడం చేత అలాగే ఆదివారం కావడం చేత ఒకరోజు ముందుగానే ఈ పంపిణీ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఉదయం 9:30 నిమిషాలకే 80% వరకు పింఛనీ పంపిణీ పూర్తి అయ్యిందని కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అలాగే అనర్హులుగా ఉన్న వారిని తొలగించేందుకు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలియజేశారు అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా చేయాలని నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో ఇప్పటికే చీరలు కూడా పంపిణీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.