రాజ్యసభలోకి యనమల ఎంట్రీ ఉంటుందా?
టీడీపీ నుంచి రెండు ఎంపీ సీట్లకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మరో మాజీ రాజ్యసభ మెంబర్ కంభంపాటి రామ్మోహనరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా వర్ల రామయ్య పేరు కూడా లిస్ట్ లో చేరింది. అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ కూతురు సుహాసిని పేరు పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడితే ఈ లిస్ట్ ఆగలేదు. ఇంకా జాబితా పెరుగుతూనే ఉంది. టీడీపీ సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజులు కూడా ఎంపీ పదవులు కోరుకుంటున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది.
టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామక్రిష్ణుడు నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటులోకి వెళ్లలేదు. దీంతో ఆయనకే ఎంపీ సీటు ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజుకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వనేలేదు. ఆయనకు సీటు ఇచ్చుంటే ఈపాటికే కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు. కాబట్టి ఈసారి ఆయనకు ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని అనిపిస్తోంది. లోక్ సభలో గెలిచిన వారంతా దాదాపుగా కొత్తవారే ఉన్నారు. దీంతో బాబుకు ఇప్పుడు సీనియర్ హ్యాండ్స్ అవసరం ఉంది. అందుకే వీరిద్దరికీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. మొత్తంమీద టీడీపీలో ఇప్పుడు ఎంపీ టికెట్ల జాతర కనిపిస్తోంది. అయితే ఎవరికి ఎంపీ టికెట్లు ఇస్తారనేది మాత్రం కాస్త ఉత్కంఠగానే ఉంది.